ఆమె ఫొటో నా పర్సులో.. బాలీవుడ్ బ్యూటీపై కన్నేసిన పాక్ క్రికెటర్

సినిమా తారలు క్రికెటర్ల మనసుల్ని దోచేస్తుంటారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి, క్రికెట్‌కి అవినాభావ సంబంధం ఉంది. భారతీయ క్రికెటర్లే కాదండోయ్.. పొరుగుదేశమైన పాకిస్తాన్ క్రికెటర్ గుండెల్లో గుబులు పుట్టించిందట బాలీవుడ్ బ్యూటీ సోనాలీ బింద్రే. హీరో హీరోయిన్లకు భారీ ఫాలోయింగ్ ఉన్న పాకిస్తాన్‌లో క్రికెటర్ షోయబ్ అక్తర్‌ ముద్దుగుమ్మ సోనాలీ బింద్రే అంటే చచ్చేంత ఇష్టమట. ఎప్పుడూ తన పర్సులో సోనాలీ ఫొటో పెట్టుకుని తిరుగుతుండేవాడట. ఒకప్పుడు ఆమెకు తన మనసులోని మాటను చెప్పాలనుకున్నానని.. ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేయాలనుకున్నానని చమత్కరించాడు షోయబ్. తెలుగులో నవ మన్మధుడు నాగార్జునతో, మెగాస్టార్ చిరుతో, మహేష్ బాబుతో రొమాన్స్ చేసిన ఈ భామ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగానే దగ్గరైంది. సినిమాలకు దూరంగా ఉన్న సోనాలీ ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడి ఇంగ్లాండ్‌లో చికిత్స చేయించుకుని ఈ మధ్యనే ఇండియాకు వచ్చింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

భారత్‌,పాక్ మ్యాచ్‌ రద్దయితే స్టార్ స్పోర్ట్స్‌కు వచ్చే నష్టం ఎంతో తెలుసా?

Sat Jun 15 , 2019
భారత్‌,పాక్ క్రికెట్ పోరుకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు నిర్వాహకులు ఎవ్వరి వ్యూహాల్లో వారు ఉంటారు. అయితే రేపు జరగబోయే మ్యాచ్ వర్షంతో రద్దయితే మాత్రం నష్టం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో దాదాపు 200 కోట్ల మేర నష్టం వచ్చినట్టు అంచనా.. ఇక భారత్ ,పాక్ పోరుకు సైతం వరుణుడు ముప్పు ఉండడంతో అందరిలోనూ […]