గుండెపోటుతో గ్రౌండ్ లోనే కుప్పకూలిన క్రికెట్‌ అంపైర్‌

క్రికెట్‌ మ్యాచ్‌ మధ్యలో అంపైర్‌కు గుండెపోటు వచ్చింది.. దాంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది.కరాచీకి చెందిన 56 ఏళ్ల నసీమ్‌ షేక్‌ కరాచీలోని టీఎంసీ గ్రౌండ్‌లో జరుగుతున్న లోకల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ కు అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే కొన్ని ఓవర్ల తరువాత అతను తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. ఈ క్రమంలో అతనికి గుండెపోటు రావడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అక్కడున్న సిబ్బంది అతన్ని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.. దురదృష్టవశాత్తు అతను అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వాస్తవానికి నసీమ్‌ మాంసం వ్యాపారం చేస్తున్నప్పటికీ క్రికెట్‌పై ఉన్న అమితమైన ప్రేమే అతన్ని జాతీయస్థాయిలో అర్హత కలిగిన అంపైర్‌గా మారేలా చేసింది. మరికొన్ని రోజులు గడిస్తే అతనికి అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశం లభించేలా ఆయన అంపైరింగ్ చేశారు. అతని మృతిపై పాక్ క్రికెటర్లు సంతాపం తెలిపారు.

TV5 News

Next Post

'సైరా' నరసింహారెడ్డి.. ఐదురోజుల కలెక్షన్స్ చూస్తే..

Tue Oct 8 , 2019
మెగాస్టార్ చిరంజీవి తాజా సంచలనం ‘సైరా’ నరసింహారెడ్డి. ఈ సినిమా మొదటిరోజునుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పైగా దసరా సెలవులు తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతూ.. ఓ రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. ఒక్క ఐదోరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక కేవలం ఐదురోజుల్లోనే […]