రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి

palla

తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్‌. త్వరలోనే సభ్యులను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వచ్చే జూన్‌ నాటికి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేస్తామని తెలిపారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని ఆధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండేలా సమన్వయ సమితులను పటిష్టంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

TV5 News

Next Post

రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా

Sat Nov 16 , 2019
రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారని అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్ సంస్థ శనివారం ప్రకటన చేసింది. అంబానీతో పాటు చాయా విరాని, రినా కరణి, మంజారి కాకర్, సురేష్ రంగాచార్ ఆర్‌కామ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. “శ్రీ మణికాంతన్ వి. ఇంతకుముందే కంపెనీ డైరెక్టర్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ వెల్లడించింది. పైన పేర్కొన్న రాజీనామాలను కంపెనీ రుణదాతల […]