కోతి, చిలుక మధ్య స్నేహం

monkey

స్నేహానికి జాతీ బేధం లేదు. దీన్ని నిజం చేస్తున్నాయి ఓ వానరం… ఓ చిలుక! జాతి వైరుద్యం మరిచి.. ఈ మూగ జీవుల మధ్య చిరుగించిన స్నేహం.. చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అదిలాబాద్‌లోని కేఆర్‌కే కాలనీలో ఆటో డ్రైవర్‌ జావీద్‌కు జంతువులు, పక్షులంటే ఎంతో ఇష్టం. ఆయన తన ఇంట్లోనే వివిధ రకాల జంతువులు, పక్షుల్ని పెంచుకుంటున్నాడు. వీటిలో కోతి, చిలుకకు మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

వీటి స్నేహం చూసి.. కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవి చేసే విన్యాసాలు, సందడి చూసేందుకు కాలనీవాసులు డ్రైవర్‌ జావీద్‌ ఇంటికి వచ్చి కొద్దిసేపు గడిపిపోతున్నారు. కోతి, చిలుక చేసే చిలిపి పనులను చూసి రోజంతా పడిన కష్టాలను మరిచిపోతున్నామంటున్నారు.

TV5 News

Next Post

అయ్యప్ప మాల ధరించిన స్టూడెంట్.. సస్పెండ్‌ చేసిన స్కూల్ యాజమాన్యం

Tue Dec 3 , 2019
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఇండియన్‌ మిషన్‌ స్కూల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ విద్యార్థి అయ్యప్ప స్వామి మాల ధరించి రావడంతో.. స్కూల్‌ యాజమాన్యం సీరియస్‌ అయ్యింది. అక్కడితో ఆగకుండా స్కూల్‌కు అయ్యప్ప మాల ధరించి వచ్చాడనే కోపంతో.. విద్యార్థిని 40 రోజులు సస్పెండ్‌ చేసింది స్కూల్‌ యాజమాన్యం. అయ్యప్ప మాల వేసుకున్నాడనే కారణంతో విద్యార్థిని సస్పెండ్‌ చేయడంపై అయ్యప్ప భజన మండలి, విశ్వహిందు పరిషత్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం […]