విజయవాడ రోడ్లపై కొట్టుకోవడానికి కూడా రెడీ: పవన్

pawan-kalyan

సీఎం జగన్ తనపై చేసిన విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ భాషా సంస్కారాన్ని మర్చిపోయిన మాట్లాడినా.. తాను మాత్రం పాలసీలపైనే ప్రశ్నిస్తానని చెప్పారు. తాను 3 పెళ్లిల్లు చేసుకుంటే సీఎం జగన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. కావాలంటే మీరు చేసుకోండంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఒక రాష్ట్రానికి సీఎం అన్న సంగతి మర్చిపోయి జగన్ మాట్లాడుతున్నారని పవన్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మార్చేందుకే ఇసుక సంక్షోభం, ఇంగ్లీష్ మీడియం వంటి సమస్యలు సృష్టించారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఎంత సంస్కారహీనంగా మాట్లడినా.. తాము మాత్రం సంస్కారంతోనే మాట్లాడుతామని చెప్పారు. కాదు గొడవలే కావాలి విజయవాడ రోడ్లపై కొట్టుకోవాలి అనుకుంటే తాము అందుకు కూడా రెడీ అన్నారు పవన్.

TV5 News

Next Post

మద్యం సేవించి.. సస్పెండ్‌‌కి గురైన ఎస్సై

Tue Nov 12 , 2019
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి ఎస్సై మురళి సస్పెండ్ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల మిలియన్‌ మార్చ్‌ రోజు ఆయన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. స్టేషన్‌ ఆవరణలోనే ఆయన మద్యం సేవించాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సీరియస్‌ అయిన ఎస్పీ శ్వేతా రెడ్డి చర్యలు తీసుకుంటూ.. ఎస్సై మరళిని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.