రైతులకు గిట్టుబాటు ధరపై త్వరలో ఆందోళన చేపడతా.. – పవన్‌

pawan

భవనాలను కూల్చేందుకు ప్రభుత్వం చూపించే శ్రద్ధ సామాన్య ప్రజల కష్టాలపై పెట్టాలన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. తిరుపతిలోని రైతు బాజర్‌లో ఉల్లి రైతులు, సామాన్య ప్రజలతో నేరుగా పవన్‌ మాట్లాడారు. 100 రూపాయలకు ఉల్లి అమ్ముతుంటే ఎలా కొనగలమని సామాన్యలు పవన్‌ ముందు వాపోయారు. దళారీల కారణంగానే విపరీంతంగా ధరలు పెరిగిపోయాయని కొనుగోలుదారులు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదంటూ .. రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరపై త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పవన్‌ భరోసా ఇచ్చారు.

TV5 News

Next Post

వైఎస్‌ వివేకా హ‌త్య కేసులో విచార‌ణ వేగ‌వంతం..

Tue Dec 3 , 2019
మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసును సిట్‌ అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా రెండు రోజుల నుంచి ముఖ్యమంత్రి జగన్‌ బాబాయ్‌, ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్ రెడ్డి, ఆయన సోదరుడు మనోహర్‌ రెడ్డి ఇంకా కొంతమందిని సిట్‌ అధికారులు విచారించారు. కడప నగర శివారులోని జిల్లా పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌లో విచారణ చేపట్టారు. అలాగే టీడీపీ నాయకుడు మాజీ జడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్‌ను […]