విశాలాంధ్ర బుక్‌హౌస్‌ ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్

pawan-kalyan

విజయవాడ ఏలూరు రోడ్డులోని విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో పుస్తక ప్రదర్శనను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రారంభించారు. అక్కడున్న వివిధ రకాల బుక్స్‌ పరిశీలించి కొన్నింటిని కొనుగోలు చేశారు. కార్ల్ మార్క్స్ పెట్టుబడి, ఫౌంటెన్ హెడ్ వంటి పలు పుస్తకాలు సొంతం చేసుకున్నారు. అక్కడ సిబ్బందిని అడిగి కొన్ని బుక్స్ గురించి ఆరా తీశారు.

పవన్ మొదట్నుంచి పుస్తకాలు ఎక్కువ చదువుతారు. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు ముందు వేసుకోవడం ఆయనకు అలవాటు. ఈ క్రమంలోనే ఇవాళ పుస్తక ప్రదర్శనకు ఆయన్ను ఆహ్వానించింది విశాలాంధ్ర యాజమాన్యం. ఆ వెంటనే వచ్చి బుక్స్‌ పరిశీలించారు పవన్ కల్యాణ్.

TV5 News

Next Post

ఏపీ మంత్రి వర్గం భేటీ వివరాలు ఇవే..

Wed Nov 13 , 2019
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఒకటవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను తప్పని సరి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి […]