మోదీ చేతుల్లో బోసి నవ్వుల్ని చిందిస్తున్న ఆ బుడతడు ఎవరో తెలిసిపోయింది..!

బిజీషెడ్యూల్‌లోనూ ప్రధాని మోదీ తన కోసం వచ్చిన చిన్నారి స్నేహితుడితో కాసేపు సరదాగా ఆడుకున్నారు. పార్లమెంట్‌లో మోదీ.. ఓ చిన్నారితో ఆడుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. చాలా ప్రత్యేకమైన స్నేహితుడు ఒకరు ఈ రోజు పార్లమెంటులో నన్ను కలుసుకున్నారు అనే క్యాప్షన్‌ ఇచ్చారు. పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలు లక్షల్లో లైక్‌లతో తెగ వైరల్‌ అయ్యాయి.

మరోవైపు మోదీ చేతుల్లో బోసి నవ్వుల్ని చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ప్రయత్నం చేశారు. తొలుత మోదీని కలవడానికి వచ్చిన సందర్శకులకు సంబంధించిన వారి బిడ్డగా భావించారు. అయితే చివరకు ఆ బుడతడు ఎవరో తెలిసిపోయింది

ప్రధాని చేతిలో ఎలాంటి బెరుకు లేకుండా ధీమాగా ఉన్న ఈ బుడతడు బీజేపీ ఎంపీ సత్యనారాయణ జతియా మనవడిగా తేలింది. మర్యాదపూర్వకంగానే మోదీని కలుసుకున్నట్లు ఎంపీ చెప్పారు.

 

View this post on Instagram

 

A very special friend came to meet me in Parliament today.

A post shared by Narendra Modi (@narendramodi) on

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

సిక్కు అల్లర్ల కేసులో 34మంది దోషులకు ఊరట

Wed Jul 24 , 2019
1984లో సంచలనం సృష్టించిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు 34 మందికి బెయిల్ మంజూరు చేసింది. సిక్కు అల్లర్ల కేసుకు సంబంధించి గతేడాది ఢిల్లీ హైకోర్టు 34మందికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వగా… వీరిలో 34 మంది ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం..తాజాగా వారందరికి బెయిల్ మంజూరు చేసింది. 34 మందికి బెయిల్‌ మంజూరు చేస్తూ చీఫ్‌ జస్టిస్‌ […]