పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం

polavaram

పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్మాణం నుంచి నవయుగను తప్పిస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనిపై నవయుగ పలుమార్లు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ తాజా ఉత్తర్వులు వచ్చాయి.

TV5 News

Next Post

పాత బస్‌ షెల్టర్‌లో సగం కాలిన మృతదేహం కలకలం

Fri Nov 8 , 2019
కడప జిల్లా రాజంపేట పాత బస్‌ షెల్టర్‌లో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. బస్‌ షెల్టర్‌లో డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వ్యక్తి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. న్యూస్‌ పేపర్లతో వ్యక్తిని తగలబెట్టిన ఆనవాళ్లు అక్కడ కనిపించాయి. కాల్చిన వ్యక్తిని పక్కకు ఈడ్చినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.