ఏపీలో ఎక్కువ ధరలు వసూలు చేసిన ఒక్కో బస్సుకు పాతిక వేలు..

Read Time:0 Second

దసరా పండుగను ప్రైవేట్ ట్రావెల్స్‌ క్యాష్ చేసుకుంటున్నాయి. పండుగ ప్రయాణికులను, అప్ అండ్ డౌన్‌ జర్నీలో అడ్డంగా దోచేస్తున్నాయి. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో… కృష్ణా జిల్లా రవాణా శాఖ ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టింది.

ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ను అధికారులు గుర్తించారు. 42 కేసులు నమోదు చేశారు. గ‌రికపాడు చెక్‌పోస్టు, పొట్టిపాడు, కీసర టోల్‌ప్లాజాల వద్ద జరిపిన తనిఖీల్లో ఐదు రోజుల్లో 295 కేసులు నమోదు చేసిన‌ట్లు DTC వెంకటేశ్వర్రావు తెలిపారు. 6 బస్సులు సీజ్ చేశామన్నారు. ఎక్కువ ధరలు వసూలు చేసిన ఒక్కో బస్సుకు పాతిక వేలు జరిమానా విధించిన‌ట్లు చెప్పారాయన. మూడు రోజుల్లో అపరాధ రుసుము పాతిక వేలు చెల్లించకపోతే బస్సులు సీజ్ చేస్తామని స్పష్టంచేశారు.

సమయం, సందర్భం ఏదైనా.. ప్రయాణికుల నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తే సహించేది లేద‌ని అధికారులు చెప్పారు. దీపావళి పండుగ వరకు ప్ర‌త్యేక బృందాలతో తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు సంబంధించిన రికార్డులను రవాణాశాఖ ఆన్‌లైన్‌లో ప్రయాణికులు చెక్‌ చేసుకోవచ్చని స్పష్టంచేశారు. ట్యాక్స్ కట్టకపోయినా.., ఫిట్‌నెస్, పర్మిట్ లేకపోయినా.. ఆ బస్సులు ఎక్కవద్ద‌ని DTC వెంకటేశ్వర్రావు ప్ర‌యాణికుల‌కు సూచించారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close