చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖకు వస్తుండడంతో.. స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీగా వెళ్తుండడంతో.. మర్రిపాలెం, ఎన్‌ఏడీల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. తమ అధినేత వస్తే కలవకుండా చేసే హక్కు ఎవరిచ్చారంటూ.. పోలీసులను విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు నిలదీశారు. బైఠాయించి నిరసన తెలిపారు. అటు.. పోలీసు వలయాన్ని ఛేదించి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎయిర్‌పోర్టు వైపు దూసుకెళ్లారు.

TV5 News

Next Post

మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌ మధ్య నిలిచిన పలు రైళ్లు

Thu Oct 10 , 2019
మహబూబ్‌నగర్ జిల్లా మన్నెంకొండ రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలు చెక్‌ చేసే రైలింజన్ అదుపు తప్పింది. దీంతో రైళ్లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దసరా పండగ కావడం, బస్సులు సరిగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే సిబ్బంది రైలింజన్‌ను తొలగించి పట్టాలను సరిచేశారు. దీని ప్రభావంతో మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌ మధ్య రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి.