దేశంలో మరో ఎన్నికల సమరం!

దేశంలో మరో ఎన్నికల సమరానికి తెరలేవనుంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్-డిసెంబర్ మధ్య ఎలక్షన్లు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. ఈ వారం చివరి నాటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది. ఇందుకు సంబంధించి సీఈసీ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ముందుగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రక్రియ ముగిసిన తర్వాత జార్ఖండ్‌లో పోలింగ్ చేపట్టనున్నారు.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు 2014 అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 15న పోలింగ్ నిర్వహించి 19న ఫలితాలు ప్రకటించారు. జార్ఖండ్‌ అసెంబ్లీకి కూడా 2014 డిసెంబర్‌లో 5 దశల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ ఉంటుందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.

హర్యానా, మహారాష్ట్రలకు దీపావళి కంటే ముందే పోలింగ్ పూర్తి చేస్తారని సమాచారం. జార్ఖండ్‌లో మాత్రం నవంబర్-డిసెంబర్ మధ్య ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. జార్ఖండ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈసీ భావిస్తోంది.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్దరించడానికి ఇస్రోకు మరో 10 రోజులు..

Wed Sep 11 , 2019
విక్రమ్‌ ల్యాండర్‌తో కాంటాక్ట్ కోసం ఇస్రో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా ట్రై చేస్తు న్నప్పటికీ కమ్యూనికేషన్ కుదరడం లేదు. ల్యాండర్‌ తో సంబంధాలు పునరుద్దరించడానికి ఇస్రోకు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. సెప్టెంబర్ 21 తర్వాత ల్యాండర్‌తో కమ్యూనికేషన్ చేయడం కుదరదు. ఎందుకంటే, చంద్రునిపై ఒక లూనార్ డే టైమ్ మాత్రమే పని చేసేలా ల్యాండర్‌ను రూపొందించారు. ఒక లూనార్ డే అంటే 14 రోజులు. […]