ఆర్టీసీ ప్రైవేటీకరణపై విచారణ వాయిదా

HIGH

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రైవేటీకరణను ఆపాలంటూ ప్రొఫెసర్‌ PL విశ్వేశ్వర్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈనెల 11 వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. 5 వేల ఒక వంద రూట్లలో ప్రైవేటీకరణ నిలిపివేసేలా చూడాలని పిటిషనర్‌ కోరారు. అటు.. కేబినెట్ ప్రొసీడింగ్స్ సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఆర్టీసీ కార్పొరేషన్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

TV5 News

Next Post

ఏపీ సీఎం, గవర్నర్‌తో సమావేశమైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Fri Nov 8 , 2019
కేంద్ర ఇంధన వనరుల, రసాయనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఏపీలో పర్యటిస్తున్నారు. గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ను కేంద్ర మంత్రి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్‌భవన్‌ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. గవర్నర్‌తో వివిధ అంశాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర చర్చించినట్టు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర మంత్రిని గవర్నర్ కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. […]