ఆరు నెలల చిన్నారి ఒంట్లో విద్యుత్ ప్రవాహం.. వీడియో

ముద్దులొలికే ఆ చిన్నారిని ముట్టుకుంటే విద్యుత్ ప్రవహిస్తోంది. ఆ విషయం అమ్మానాన్నకి తెలిసి వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెట్టారు. పాపాయి ఒంట్లో నిజంగానే విద్యుత్ ప్రవహిస్తుందని చెప్పేసరికి వారికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. పశ్చిమ గోదావరి జిల్లా దామచర్ల గ్రామానికి చెందిన ఏలూరి హరిబాబు, సుస్మిత దంపతులకు ఆరు నెలల క్రితం పాప జన్మించింది. ఓ రోజు పాప ఆడుకుంటూ అక్కడే కింద ఉన్న ఎల్‌ఈడీ బల్బ్‌కి తగిలింది. దాంతో లైటు వెలిగింది. అది చూసి పాప తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. విషయం తెలిసి చుట్టు పక్కల గ్రామ ప్రజలు వచ్చి పాపను చూస్తున్నారు. అవేమీ తెలియని ఆ చిన్నారి బోసి నవ్వులతో ఆనందాన్ని పంచుతోంది. పాప ఒంట్లో అలా విద్యుత్ ప్రవహించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాపకు మరే విధమైన అనారోగ్య సమస్యలు లేకపోవడంతో ఎదిగే క్రమంలో ఏమైనా తగ్గుతుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు తగినశాస్తి చేసిన భార్య

Tue Sep 24 , 2019
మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యాపిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్న భర్తకు ఓ భార్య తగినశాస్తి చేసింది. సాటి మహిళల సహకారంతో అతనికి బడితే పూజ చేసింది. ఈ ఘటన వరంగల్‌ పట్టణంలోని శివనగర్‌లో మంగళవారం ఉదయం జరిగింది. శివనగర్‌ కు చెందిన ముత్తోజు రవి మూడేళ్లుగా భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. భార్య సరిత, బంధువులు ఎంత చెప్పినా వినకుండా ఆ మహిళతో వివాహేతర […]