ప్రజా వేదిక కూల్చివేత.. ఆ అంచనా సాధ్యం కాలేదు..

ఉండవల్లిలో ప్రజా వేదిక కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి నుంచి కూల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్న సీఆర్‌డీఏ అధికారులు.. 70 శాతానికి పైగా పూర్తి చేశారు. ఐరన్‌ రేకులతో నిర్మించిన పైకప్పు కావడంతో వాటిని తొలగించేందకు ఇవాళ సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉంది.

నిన్న రాత్రి వరకు కూల్చివేత పూర్తవుతుందని అంచనా వేశారు. అయితే.. అది సాధ్యం కాలేదు. భవనాన్ని పూర్తి నేలమట్టానికి మరికొంత సమయం పడుతుందంటున్నారు సీఆర్‌డీఏ అధికారులు.

జేసీబీలు, సుమారు వంద మంది కూలీలతో ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రజావేదిక వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ కూల్చివేతను వ్యతిరేకిస్తున్న వారసులు

Thu Jun 27 , 2019
తెలంగాణాకు నూతన అసెంబ్లీ భవన నిర్మాణం కోసం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో చారిత్రక ప్యాలెస్‌ను కూల్చివేయాలని తలపెట్టింది ప్రభుత్వం. అయితే.. దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు దాని వారసులు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ నవాబ్‌ సఫ్దర్‌ జంగ్‌ మనవళ్లు నగరానికి వచ్చి ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ పరిరక్షణపై చర్చించారు. 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కు చెదరలేదని.. మరో 200 ఏళ్లపాటు ఇలాగే ఉంటుందని.. ఈ వారసత్వ కట్టడాన్ని ప్రభుత్వం […]