పదవికి రాజీనామా చేస్తా.. పృథ్వీరాజ్‌ సంచలన వ్యాఖ్యలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. మా ప్రెసిడెంట్‌ నరేష్‌పై ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి జీవితలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఈసీ మెంబర్‌గా గెలిచినందుకు బాధగా ఉందన్నారాయన. ఈసీ మెంబర్‌ పదవికి రాజీనామా చేస్తానన్నారు. సినీ పెద్దలు జోక్యం చేసుకుంటే.. సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. మా ప్రెసిడెంట్‌గా గెలిచిన నరేష్‌.. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా ఫీలవుతున్నడంటూ విమర్శించారు. ఏం మాట్లాడినా జీవితా రాజశేఖర్‌ తప్పుబడుతున్నారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరి గోపాలకృష్ణకు అవమానం జరిగిందని.. పరుచూరి కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు పృథ్వీరాజ్‌.

TV5 News

Next Post

నరేష్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి - జీవిత, రాజశేఖర్‌

Sun Oct 20 , 2019
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. మా ప్రెసిడెంట్‌ నరేష్‌పై ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి జీవితలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రెసిడెంట్‌ అయినప్పటి నుంచి నరేష్‌..  చేసిందేమి లేదంటూ ఆరోపించారు జీవితా రాజశేఖర్‌లు‌. నరేష్‌ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన పదవిలో వచ్చినప్పటి నుంచి ఫండ్‌ రైజింగ్‌ కూడా చేసిందేమి లేదంటూ ఫైరయ్యారు. అంతే కాకుండా.. అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో వీరి మధ్యం […]