వృద్ధుడిని మింగబోయిన కొండచిలువ.. చివరకు..(వీడియో)

పాముల్లో కొండచిలువ అత్యంత బయంకరమైనదన్న విషయం అందరికి తెలుసు. మనిషి ఒంటరిగా కనబడితే మింగేస్తుంది. కొండచిలువ భారిన పడి మరణించిన వారి సంఖ్య చాలానే ఉంది. అయితే తాజాగా ఓ వృద్ధుడు కొండచిలువ భారిన పడి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తిరువనంతపురంలోని నెయ్యర్ ఆనకట్ట సమీపంలో 61 ఏళ్ల భువనచంద్రన్ నాయర్ తన తోటి కూలీలతో పొదలను శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో పొదల చాటున నక్కిన ఆ కొండచిలువ.. నాయర్ ను చూసింది.

దాంతో అమాంతం అతని మీదకు దూకింది. నాయర్ మెడను ఉక్కిరిబిక్కిరి చేసింది. అతను అరిచేందుకు కూడా మార్గం లేకుండా మెడను చుట్టేసింది. అదృష్టవశాత్తూ, ఘటనా స్థలంలో ఉన్న ఇతర కార్మికులు కొండచిలువను పట్టుకున్నారు. అతని మెడలో నుండి పామును విడదీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వీడియో తెలియజేస్తుంది. ఈ భయానక వీడియో.. కొండచిలువ నాయర్ మెడ చుట్టూ పట్టు బిగించడంతో అతను రోధిస్తున్నట్టు చూపిస్తుంది.

TV5 News

Next Post

ప్రియురాలిని కొట్టి మూడో అంతస్తు పై నుండి తోసేసిన ప్రియుడు

Fri Oct 18 , 2019
వనస్థలిపురం వాసవీ కాలనీలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్థుపై నుండి ప్రియురాలి సీమను కొట్టి ఆమె ప్రియుడు దిలీప్‌ కిందకు తోసేశాడు. తీవ్ర గాయాల పాలై ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పరారీలో ఉన్న దిలీప్‌పై కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలిస్తున్నారు. 15 రోజుల కిందట మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన దిలీప్‌, సీమలు వనస్థలిపురం శక్తి నగర్‌లోని వాసవి నిలియంలో […]