రోడ్డుపై భారీ కొండచిలువ..

మహబూబాబాద్‌లో రాత్రి ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది. భారీ కొండచిలువ అటవీ ప్రాంతంలో నుంచి జనావాసాల్లోకి ప్రవేశించింది. ఫాతిమా హైస్కూల్ సమీపంలో రోడ్డుపై తిరుగుతున్న కొండచిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లొచ్చేలోపు దాన్ని పట్టుకునేందుకు కొందరు ట్రై చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. చివరికి ఫారెస్ట్ సిబ్బంది వచ్చి జాగ్రత్తగా దాన్ని పట్టి గోనె సంచిలో తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కారు అద్దెకు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు.. సీటు కింద 300 సెల్‌ఫోన్లు..

Thu Oct 3 , 2019
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సెల్‌ఫోన్‌ దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వాళ్ల దగ్గర నుంచి 300 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్‌లో సాయిరాం, అభి అనే ఇద్దరు వ్యక్తులు కారును లోకల్‌గా అద్దెకు తీసుకున్నారు. ఐతే.. వీళ్లు విజయవాడ దాటి వెళ్తున్నట్టు GPS ద్వారా గుర్తించిన యజమాని అక్కడున్న తన బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఇంతలో కారు జగ్గయ్యపేట సమీపంలోని ఓ హోటల్‌లో ఆగినట్టు తెలుసుకుని.. మళ్లీ అది […]