నటుడికి షాక్‌.. రెండు అరటి పండ్లపై అతనికి వేసిన బిల్‌ ఎంతో తెలుసా?

బాలీవుడ్‌ నటుడుకి ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. రెండు అరటి పండ్ల ఆర్డర్‌పై వారు వేసిన బిల్లును చూసి అతను బిత్తరపోయారు. బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ బోస్‌ జిమ్‌ చేసిన అనంతరం రెండు అరటి పండ్లకు ఆర్డర్‌ ఇచ్చారు. అనంతరం అతనికి వచ్చిన బిల్లును చూసి కళ్లు తేలేశాడు. రెండు బనానాలకు ఏకంగా రూ.443 బిల్‌ చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. “పండ్లు కూడా చెడు చేస్తాయనడానికి ఇలాంటి సంఘటనే ఓ ఉదాహరణ. ఇంత ధరను పెట్టి కొంటే బాధగా ఉండదా..!” అంటూ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా వాటిపై జీఎస్‌టీ కూడా వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

బోస్‌ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. పండ్లపై జీఎస్‌టీ వేయడమేంటని కొందరు ప్రశ్నస్తుంటే.. మరికొందరు పట్టపగలే దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది బోస్‌కు సలహాలు కూడా ఇచ్చారు. భారీ స్థాయిలో చార్జీలు వసూలు చేస్తున్న ఆ హోటల్లో ఉండటమెందుకు మరో హోటల్‌కి వెళ్ళోచ్చుగా అంటూ సలహా ఇచ్చారు. అరటి పండ్లు కావాలంటే బయట కూడా దొరుకుతాయి. అక్కడి వెళ్ళి కొనుక్కోవచ్చుగా అంటూ ఓ నెటిజన్ సూచించాడు. అయినా రెండు అరటి పండ్లకు అంత మెుత్లంలో బిల్లు వేయడం.. స్టార్ హోటళ్ళ దోపిడికి అద్దం పడుతుంది. దీంతో సామాన్యుడు వాటివంక కన్నెత్తి చూడాలంటేనే వణికిపోతున్నాడు. జేబుకు చిల్లు పడుతుందేమోనని జాగ్రత్త పడుతున్నాడు. స్టార్ హోటళ్ళలో బస చేయడం సంపన్నులకు మాత్రమే సాధ్యమనేది ఈ సంఘటన మరోసారి నిజం చేసింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

మేయర్ ఇంటి ముందు ఏటీఎంను పగలకొట్టిన దొంగలు

Wed Jul 24 , 2019
ఖమ్మంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మామిళ్లగూడెంలో ఎస్‌బిఐకు చెందిన ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు పగులకొట్టి డబ్బును దొంగలించేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకపోవడంతో అక్కడ నుంచి పారిపోయారు. రాత్రి రెండు, మూడు గంటల సమయంలో ఏటీఎంలో దొంగతనానికి పాల్పడి ఉంచవచ్చని స్థానికులు పేర్కొన్నారు. ఖమ్మం మేయర్ ఇంటిముందే దొంగలు రెచ్చిపోయి దొంగతనానికి పాల్పడుతుంటే .. ఇక సామన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద రక్షణ లేకపోవడం వలనే […]