తప్పిన పెనుప్రమాదం.. ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు

train

కడప జిల్లా రైల్వే కోడూరు స్టేషన్‌ వద్ద.. తిరుపతి – షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్‌ వెనుక ఉన్న జనరల్‌ బోగి పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే రైలును నిలిపేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది.. మరమ్మత్తులు చేపడుతున్నారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

TV5 News

Next Post

మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డుని ఈ నెలాఖరులోపు..

Tue Dec 3 , 2019
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మ్యాగ్‌స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచిస్తోంది. కస్టమర్ల వద్ద ఉన్న పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు వివరించింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు జరుగుతున్న వాటిని అరికట్టే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఈఎంవీ చిప్ కార్డు […]