రైల్వే ఉద్యోగాలకు అప్లై చేశారా.. మొత్తం పోస్టులు 1,03,769.. 

రైల్వే రిక్రూట్‌మెంట్ లెవెల్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. సంతకం, ఫోటో తదితర కారణాల వల్ల రిజెక్ట్ అయిన దరఖాస్తుల్ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ మళ్లీ పరిశీలించనుంది. తమ దరఖాస్తులను రైల్వే బోర్డు తిప్పిపంపించిందని అనేక మంది అభ్యర్థులు ఆర్ఆర్‌బీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదుల్ని పరిశీలించాలని ఆర్ఆర్‌బీ నిర్ణయించింది. అనంతరం వివరాలను ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా 2019 ఆగస్ట్ 31 లోగా అభ్యర్థులకు సమాచారం ఇస్తామని, తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు సంబంధిత రీజియన్ వెబ్‌సైట్ చూడాలని ఆర్ఆర్‌బీ నోటీస్ జారీ చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

వరద బాధితులకు భారీ సాయం.. బాలీవుడ్ జంట ఔదార్యం

Tue Aug 13 , 2019
అందమైన రూపం వుంటే సరిపోదు.. స్పందించే మనసు కూడా ఉండాలని నిరూపించింది నటి జెనీలియా. భర్త రితేష్‌తో కలిసి వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందించారు. మహారాష్ట్రను ముంచెత్తిన వరదల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటిని చూసి చెలించిన జెనీలియా దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం అందజేశారు. వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని […]