హైదరాబాద్‌లో కుండపోత వర్షం

హైదరబాద్‌లో కుండపోత కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్లు రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరడంతో చెరువులను తలించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు కాలనీలల్లోని ఇళ్లులోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.

జూబ్లీ హిల్స్‌, బంజారాహీల్స్‌, అమీర్‌పేట, బేగంపేట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, మియాపూర్‌, జేఎన్‌టీయూ, సికింద్రాబాద్‌, కవాడిగూడ, పద్మారావు నగర్, రాంనగర్, బోయిన్‌పల్లి, అల్వాల్‌, ఉప్పల్‌, తార్నాక, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. డ్రైనేజీలన్నీ పొంగిపొర్లాయి. ప్రధాన కూడల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షంతో అటు జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమైయ్యారు. సహాయ చర్యలు ప్రారంభించారు.

TV5 News

Next Post

సిక్స్‌ కొట్టి డబుల్ సెంచరీ పూర్తి చేసిన హిట్‌మ్యాన్‌

Sun Oct 20 , 2019
సూపర్‌ ఫామ్‌లో దూసుకుపోతున్న హిట్ మ్యాన్‌ రోహిత్ శర్మ.. రాంచీ టెస్ట్‌లో దుమ్మురేపాడు. డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. సిక్స్‌ కొట్టి తన టెస్ట్‌ కెరీర్‌లోనే తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 250 బంతుల్లో 28 ఫోర్లు, 5 సిక్సులతో కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను రోహిత్‌ ఆదుకున్నాడు. దూకుడుగా ఆడుతూ రహనేతో కలిసి స్కోరు బోర్డును […]