టీచర్స్ డే రోజు ‘ఆర్‌జీవీ’ స్పెషల్ ట్వీట్.. నెటిజన్స్ చేతిలో చీవాట్లు..

వర్మగారూ.. ఎవరండీ మీకు చదువు చెప్పింది.. ఇలానా వారికి ఉపాధ్యాయుల దినోత్సవం రోజున శుభాకాంక్షలు చెప్పేది అంటూ నెటిజన్స్ డైరక్టర్ రాంగోపాల్ వర్మ మీద ఫైర్ అవుతున్నారు. మీరు సినిమాలు తీసేంత నాలెడ్జ్ సంపాదించారంటే అదంతా గురువుగారి పుణ్యం కాకపోతే మరేంటి అని ప్రశ్నిస్తున్నారు.. ఇంతకీ ఇంతటి వివాదానికి కారణమైన వర్మ ఏం చేశారో తెలుసా..  తానేంచేసినా డిఫరెంట్‌గా ఉండాలని కోరుకుంటారు వర్మ. వివాదాస్పద వ్యాఖ్యలతో అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేస్తారు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని.. ఉపాధ్యాయులకు వెరైటీ ట్వీట్‌తో శుభాకాంక్షలు చెప్పారు ఆర్‌జీవీ. టీచర్స్ డేని విస్కీ బాటిల్‌తో లింక్ పెట్టి పోస్ట్ చేశారు. టీచర్స్ డే రోజు టీచర్లు.. విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. అపార్థం చేసుకోకండి.. ఊరికే అడుగుతున్నాను అంటూ కామెంట్ చేశారు వర్మ.

తనను మంచి విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దండంలో టీచర్లు ఫెయిల్ అయ్యారని.. అందువలన తనకు టీచ్చర్స్ డే అంటే ఏంటో తెలియదని అంటున్నారు. నేనో బ్యాడ్ స్టూడెంట్‌ని అని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు వర్మ. ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్.. వివాదాస్సద చిత్రాలు చేస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మొత్తానికి నలుగురి నోళ్లలో నానుతున్నారు కదా.. అది చాలదా.. గురువు గారు మంచే బోధించినా మీరు దాన్ని మరోలా అర్థం చేసుకుని ఉంటారు. మొత్తానికి సెన్సేషనల్ డైరెక్టర్‌గా అయితే పేరు తెచ్చుకున్నారు కదా.. మరి అదంతా టీచర్లు నేర్పించిన పాఠాల వల్లే కదా సాధ్యమైంది అంటూ.. ఏది ఏమైనా జీవితంలో ఓ స్థాయికి చేర్చిన గురువుని ఇలా అవమానించడం సరికాదంటున్నారు నెటిజన్లు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఫైన్ల మోత.. ట్రాక్టర్‌ డ్రైవర్‌కు రూ.59 వేలు జరిమానా

Thu Sep 5 , 2019
కేంద్రం తీసుకువచ్చిన మోటారు వాహనాల చట్టంతో ఫైన్ల మోత మోగుతోంది. ట్రాఫిక్ పోలీసులు నియమాలను ఉల్లంఘించిన వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. తాజాగా హర్యానాలో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని ఒక ట్రాక్టర్‌ డ్రైవర్‌కు ఏకంగా రూ. 59 వేల మేరకు జరిమానా విధించారు. అలాగే 10 ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన ట్రక్కు డ్రైవర్‌కు భారీ మెుత్తంలో ఫైన్ విధించినట్లుగా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సదరు ట్రక్కు డ్రైవర్ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, […]