పొర్లు దండాలు పెట్టి.. వినూత్నంగా నిరసన తెలిపిన రాయలసీమ వాసులు

 

SRI

కడపలో రాయలసీమ వాసులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. శ్రీబాగ్‌ ఒప్పందం జరిగి నేటికి 82 ఏళ్లు పూర్తయ్యాయని.. అయినా పాలక ప్రతిపక్షాలు రాయలసీమపై వివక్ష చూపిస్తున్నాయని విమర్శించారు ఏపీ విభజన హామీల ప్రత్యేక హోదా సమితి నేతలు. అప్పటి శ్రీబాగ్‌ ఒప్పందంలో కమిటీ ఛైర్మన్‌గా ఉన్న కోటిరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కడప కోటిరెడ్డి సర్కిల్‌లో ఆయన విగ్రహం ఎదుట పొర్లు దండాలు పెట్టి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మనసు మార్చి రాజధాని, హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేసేలా చేయాలని కోరారు.

TV5 News

Next Post

మెగాస్టార్‌ తొలి చిత్రం దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

Sat Nov 16 , 2019
మెగాస్టార్‌ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు రాజ్‌కుమార్‌ దీనస్థితిని అర్ధం చేసుకున్నారు సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖులు. ఆయనకు ఆర్థిక సాయం అందించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టారు, చికిత్స చేసుకునేందుకు కనీస స్థోమత లేదు. దాంతో ఆయన దీనగాథ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రాజ్ కుమార్ పరిస్థితిని గురించి తెలుసుకున్నప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ […]