ఏటీఎంలో నగదు డ్రా చేసుకునేవారికి శుభవార్త

ఏటీఎంలో నగదు డ్రా చేసుకోవడానికి వెళితే అక్కడ నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తాయి.. అలాంటి సమయాల్లో కోపం నషాళానికి అంటుకుంటుంది. పోనీ కొంత సమయం తరువాత అయినా ఏటీఎంలో నగదు ఫిల్ చేస్తారని అనుకుంటే అలా జరగదు.. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు తీరిగ్గా లోడ్ చేసేవారు. దీంతో ఏటీఎం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏ ఏటీఎం లోనైనా నగదు అయిపోతే అందులో మూడు గంటలలోపే నగదు లోడ్ చెయ్యాలి.. లేదంటే సంబంధిత ఏటీఎంల బ్యాంకులకు జరిమానా విధిస్తామని ఆర్బీఐ అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రాంతాన్ని బట్టి జరిమానా ఎంత ఉండాలనేది త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఏటీఎంలు నిత్యం నగదుతో ఖాతాదారులకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించండి : ఉపరాష్ట్రపతి

Fri Jun 14 , 2019
నవ్యాంధ్ర ప్రజల జీవనాడి ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు సూచించారు. తన నివాసానికి వచ్చిన కేంద్రమంత్రికి… ప్రాజెక్టు కు సంబంధించిన వివరాలు తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారం అందించాలని వెంకయ్య కోరారు. గోదావరి, పెన్నా నదులను కావేరితో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి.. […]