పెళ్లిచేసుకుంటానని యువతిని మోసం చేసిన ఇన్‌స్పెక్టర్‌

చిత్తూరులో రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్‌పై రేప్‌ అండ్ చీటింగ్‌ కేసు నమోదైంది. అదే కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న యువతితో ప్రేమ్‌కుమార్ సన్నిహితంగా మెలిగారు. వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ నకిలీ మ్యారేజ్ సర్టిఫికెట్‌ కూడా సృష్టించాడు. అయితే ఇటీవల ప్రేమ్‌కుమార్ ఇంటికి రాకపోవడంతో ఆ యువతి ఆరా తీసింది. దీంతో ఆ మ్యారేజ్‌ సర్టిఫికెట్ నకిలీదని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ యువతి 3 నెలల గర్భవతి కావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. పరారీలో ఉన్న ప్రేమ్‌కుమార్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

227 మంది చిన్నారులు.. ఒకరి తర్వాత ఒకరు..

Wed Aug 28 , 2019
అది చిలీ దేశం.. పెరూలోని ఓ చారిత్రక ప్రదేశంలో పురావస్తు శాఖ తవ్వినకొద్దీ గుట్టలు గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి. ఈ అవశేషాలన్నీ 4 నుంచి 14 ఏళ్ల లోపు వారివే. లిమాకు దగ్గర్లో ఉన్న తీర ప్రాంత పట్టణం హువాన్‌చాకోలో 227 మానవ శరీర అవశేషాల్ని కనుగొన్నారు ఆర్కియాలజిస్టులు.1475లో అంతరించిన ఈ జాతి చిమూ సంస్కృతికి చెందినదిగా పరిశోధకులు తెలిపారు వారు ఆరాధించే దేవుడు కోసం తమకు తాముగా ప్రాణ […]