డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. 20 అడుగులు ఎత్తుకు ఎగిరి పొలంలో పడిన..

షాద్‌నగర్‌ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి అనంతపురం బయలుదేరిన మారుతి ఎర్టిగా కారు.. మరో కారును ఓవర్‌ టేక్‌ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొడుతూ.. రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే చనిపోగా.. మరో నలుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ దుర్ఘటనలో ఓ యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం సమయంలో కారులో 8 మంది యువకులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడి మృతదేహం.. 20 అడుగులు ఎత్తుకు ఎగిరి పొలంలో పడింది. ఈ మార్గంలో భారీ ట్రాఫిక్‌జామ్‌ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

TV5 News

Next Post

చెన్నైలో చైనా అధ్యక్షుడికి గ్రాండ్‌ వెల్‌కమ్

Fri Oct 11 , 2019
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకిస్తూ ముందుకు కదిలారు జిన్‌పింగ్‌. మైలాపూర్ ఆలయ పూజారులు వేద మంత్రాలు చదువుతూ.. పూర్ణకుంభాన్ని బహూకరించారు. దీని ప్రాముఖ్యాన్ని అక్కడే ఉన్న చైనా అనువాదకుడు జిన్ పింగ్‌కు వివరించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా జిన్ […]