డిస్కౌంట్‌ పేరుతో ఘరానా మోసం

fraud

వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రోజా ట్రేడర్స్‌-ఆర్డర్‌ సప్లయర్‌ పేరుతో జనాలకు కొందరు వ్యాపారులు కుచ్చుటోపి పెట్టారు. ఎలక్ట్రానిక్‌, ఫర్నిచర్‌ వస్తువుల, మొబైల్ ఫోన్లపై 40 శాతం.. డిస్కౌంట్‌ ఇప్పిస్తామని చెప్పి ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేశారు. ఇలా దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిన తరువాత బోర్టు తిప్పేశారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న స్థానికులు.. షాపు ముందు నిరసనకు దిగారు.

TV5 News

Next Post

దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడి అరెస్ట్‌

Tue Dec 3 , 2019
దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడ్ని హైదరాబాద్‌లోని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దిశపై జరిగిన దారుణంపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతుంటే.. కొందరు మాత్రం పిచ్చి పోస్టులతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. అలా పోస్టులు చేసిన నిజామాబాద్‌కు చెందిన శ్రీరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిశకు వ్యతిరేకంగా అసభ్యకర కామెంట్లపై సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీరామ్‌పై వయోలేషన్‌, ఐపీసీ యాక్ట్‌ కింద కేసులు నమోదు […]