లంగరు బోటుకు తగలి బయటకి వచ్చిన తలలేని మృతదేహం

కచ్చులూరు బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం, గజఈతగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండోసారి గోదావరి అడుగుభాగంలోకి వెళ్లి వచ్చారు గజ ఈతగాళ్లు. బోటు మునిగిన ప్రాంతం నుంచి తల లేని మృతదేహం ఒకటి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. నల్లజీన్‌ ప్యాంట్‌తో ఉన్న మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. లంగర్‌కు బోటు తగిలి కదలటం వల్లే ఈ మృతదేహం బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెలికీతీత పనులు మరింత ముమ్మరం చేసింది ధర్మాడీ సత్యం బృందం.

TV5 News

Next Post

పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై ఆర్మీ అటాక్

Sun Oct 20 , 2019
ఉగ్రవాదులపై భారత సైన్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల ధ్వంసమే లక్ష్యంగా దాడులు చేసింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న టెర్రరిస్టు క్యాంపులపై భద్రతా బలగాలు దాడి చేశాయి. సరిహద్దులు దాటకుండానే ముష్కరమూకల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించారు. ఇందుకోసం ఆర్టిలరీ గన్స్ ఉపయోగించారు. శతఘ్నుల సాయంతో బోర్డర్‌కు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశారు. టాంగ్‌ధర్ సెక్టార్‌కు ఎదురుగా పీఓకేలోని నీలం […]