గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయిన డెడ్‌బాడీలు

రాయల్ వశిష్ట బోటులో బయటపడిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న బోటును వెలికి తీసిన తర్వాత అందులో 8 డెడ్‌బాడీస్ ఉన్నట్లు తేల్చారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. ఒంటిపై దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా గుర్తిస్తున్నారు.. ఇప్పటికి రెండు మృతదేహాలను గుర్తించారు.

ఆధార్ కార్డు ఆధారంగా ఒక మృతదేహం వరంగల్‌కు చెందిన కొమ్ముల రవిదిగా తేల్చారు.. మరొరిని రాయల్ వశిష్ట బోటు డ్రైవర్ సంగాడి నూకరాజుగా గుర్తించారు.ఇతనిది కాకినాడ. ఇంకా ఆరు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది..బంధువుల రోదనలతో ఆస్పత్రిలో విషాదం అలుముకుంది. గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయిన డెడ్‌బాడీలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు…

గోదావరిలో మునిగిపోయిన 38 రోజుల తర్వాత బోటును బయటికి తీశారు.. ఇన్నిరోజులు నీళ్లలోనే ఉండిపోవడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయాయి. అందుకే గుర్తించడం చాలా కష్టం అవుతోంది..మిగతా మృతదేహాలను గుర్తుపడితే బంధువులకు అప్పగిస్తారు. లేదంటే డీఎన్‌ఏ టెస్ట్‌లు చేసే అవకాశం ఉంది.

TV5 News

Next Post

ఆసక్తికరమైన ఎగ్జిట్‌పోల్స్.. హర్యానాలో..

Wed Oct 23 , 2019
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలిపోనున్నాయి. దాదాపు ఎగ్జిట్‌పోల్స్ అన్ని ఈ రెండు రాష్ట్రాల్లోనూ మళ్లీ కమలమే వికసిస్తుందని తేల్చేశాయి. అయితే హర్యానాలో మాత్రం కమలదళానికి గెలుపు అనుకున్నంత ఈజీగా దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని చెబుతోంది ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్. హర్యానా అసెంబ్లీలో 90 స్థానాలున్నాయి. బీజేపీకి 75 వరకు సీట్లు వస్తాయని […]