ఆర్టీసీ కండక్టర్‌ ఆత్మహత్యాయత్నం

ఖమ్మంలో ఆర్టీసీ కండక్టర్‌ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. శ్రీనివాస్‌ రెడ్డి అనే కండక్టర్‌ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ఆయన శరీరం 90 శాతం కాలిపోయింది. సమ్మెపై ప్రభుత్వ వైఖరితో మనస్తాపం చెంది శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కార్మికులు ఆరోపిస్తున్నారు.

TV5 News

Next Post

మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి జవహర్‌

Sat Oct 12 , 2019
గత ప్రభుత్వం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జవహర్‌ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టే ప్రయత్నిస్తున్నారని జవహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బెల్టు షాపులు పెరిగాయని, స్టిక్కర్లతో జగన్‌ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని జవహర్‌ ఎద్దేవా చేశారు.