తెలంగాణలో అరెస్ట్‌ల పర్వం..

rtc

శనివారం ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మిలియన్ మార్చ్‌ తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తోంది జేఏసీ. పలు పార్టీల నేతలు కూడా మద్దతు తెలిపారు. దీంతో జిల్లాల నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున కార్మికులును హైదరాబాద్ తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడిక్కడ నిర్భందాలు చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు.. పలు పార్టీల నాయకుల్ని కూడా అదుపులోకి తీసుకుంటారు. హైదరాబాద్ విద్యానగర్‌లో ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు.

TV5 News

Next Post

పనిమనిషికి ఓనరమ్మ సాయం.. ఐడియా అదిరింది..

Fri Nov 8 , 2019
ఆరోగ్యం బాగా లేకపోయినా అమ్మగారు అరుస్తారని చెప్పిన టైమ్‌కి వచ్చేయాలి పనివాళ్లు. తనకు వచ్చిన కష్టం చెప్పుకుందామంటే వినేవాళ్లే ఉండరు. అందరూ అలానే ఉంటారా అంటే చెప్పడం కష్టం. కానీ ఎక్కువ శాతం మందికి పనిమనుషుల కష్టం సుఖం పట్టించుకునే తీరిక ఉండదు. ఒక్కరోజు రాకపోయినా ఒళ్లంతా హూనం అయిందే తల్లి. ఇంట్లో పనంతా చేసేసరికి అంటూ అమ్మగారు ఆపసోపాలు పడుతుంది. ఇక ఈ బిజీ లైఫ్‌లో పక్కవారి గురించి […]