ఆర్టీసీ కార్మికుల ర్యాలీలో ఉద్రిక్తత

వరంగల్‌లో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అదాలత్ సెంటర్‌లో అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలోనే తోపులాట మొదలైంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు నిరసనకారులందరినీ అక్కడి నుంచి చెదరగొట్టారు. కొందర్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై ఆర్టీసీ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తుంటే ఇలా అరెస్టులు చేయించడం ఏంటని మండిపడ్డారు.

TV5 News

Next Post

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో క్యాజువల్ కండక్టర్ల చేతివాటం

Thu Oct 10 , 2019
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె… తాత్కాలిక సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. ప్రయాణికుల నుంచి ఇష్టమొచ్చినంత వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే.. సమ్మె స్పెషల్ అంటూ సమాధానం చెప్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు సాధారణంగా 64 రూపాయల ఛార్జీ ఉండగా.. 150 రూపాయలు ఎలా వసూలు చేస్తారంటూ తాత్కాలిక కండక్టర్‌ను ప్రయాణికులు నిలదీశారు. దీంతో.. వాగ్వాదం చోటు చేసుకుంది. క్యాజువల్ కండక్టర్లు […]