ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు

ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 15కు హైకోర్టు వాయిదా వేసింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. డిమాండ్లు పరిష్కరించే లోపే కార్మికులు సమ్మెకు వెళ్లారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

సమ్మెపై ఆర్టీసీ కార్మికులు హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. నెల రోజుల ముందే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని కార్మిక జేఏసీ నేతలు హైకోర్టుకు తెలిపారు. సమ్మె సందర్భంగా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పాస్‌లున్నవారికి కూడా టిక్కెట్లు ఇస్తున్నారని కోర్టుకు తెలిపారు పిటిషనర్‌.

TV5 News

Next Post

ఆర్టీసీ కార్మికుల ర్యాలీలో ఉద్రిక్తత

Thu Oct 10 , 2019
వరంగల్‌లో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అదాలత్ సెంటర్‌లో అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలోనే తోపులాట మొదలైంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు నిరసనకారులందరినీ అక్కడి నుంచి చెదరగొట్టారు. కొందర్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మహిళలపై పోలీసులు దురుసుగా […]