ఈ నెల 19 న రాష్ట్ర బంద్‌ చేపట్టనున్న ఆర్టీసీ జేఏసీ

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉధృతరూపం దాల్చుతోంది. ఇప్పటికే విపక్షాల మద్దతు కూడగట్టుకున్న ఆర్టీసీ జేఏసీ రేపటి నుంచి ఈనెల 19 వరకు రోజుకో విధంగా నిరసన తెలపాలని నిర్ణయించింది. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

మరోవైపు.. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కూడా సీరియస్‌గానే స్పందిస్తోంది. ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం 50 శాతం బస్సులు తిరిగేందుకు అనువుగా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు.

TV5 News

Next Post

బస్‌భవన్‌ ముందు నిరసన.. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు గాయం

Sat Oct 12 , 2019
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బస్‌భవన్‌ ముందు నిరనస చేపట్టిన బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు స్వల్ప గాయమైంది. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న లక్ష్మణ్‌తో పాటు ఆర్టీసీ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అందరినీ బలవంతంగా జీపుల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా.. లక్ష్మణ్‌ కంటికి గాయమైంది. నియంతృత్వ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాము పోరాడుతామని హెచ్చరించారు. ఈ సమ్మెకు ప్రజలు, అన్ని వర్గాలు మద్దతు తెలపాలని లక్ష్మణ్‌ […]