ఆర్టీసీ కార్మికుల సమ్మెతో క్యాజువల్ కండక్టర్ల చేతివాటం

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె… తాత్కాలిక సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. ప్రయాణికుల నుంచి ఇష్టమొచ్చినంత వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే.. సమ్మె స్పెషల్ అంటూ సమాధానం చెప్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు సాధారణంగా 64 రూపాయల ఛార్జీ ఉండగా.. 150 రూపాయలు ఎలా వసూలు చేస్తారంటూ తాత్కాలిక కండక్టర్‌ను ప్రయాణికులు నిలదీశారు. దీంతో.. వాగ్వాదం చోటు చేసుకుంది. క్యాజువల్ కండక్టర్లు చేతివాటం చూపిస్తున్నారని ప్రయాణికులు అంటున్నారు.

TV5 News

Next Post

ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి గెంటేసిన భర్త

Thu Oct 10 , 2019
ప్రేమించి పెళ్ళి చేసుకుంది.. భర్తే సర్వస్వం అనుకుంది. ఎన్నో ఆశలతో అత్తారింట అడుగుపెట్టింది. అయితే.. ఆ ఆశలన్నీ నాలుగు రోజులకే ఆవిరైపోయాయి. అదనపు కట్నం కోసం భర్త, అత్త పెట్టే టార్చర్ ను దిగమింగింది. ఎముకలు విరిగేటట్టు భర్త కొట్టినా సహించింది. ఇలా ఎనిమిదేళ్ళ పాటు చిత్రహింసలు భరించినా.. భర్త రెండవ పెళ్ళి చేసుకోవడానికి సిద్థమవడం సహించలేపోయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. అక్కడా న్యాయం జరగకపోవడంతో భర్త ఇంటి ముందే […]