తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం

PAVAN

రాయలసీమ పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చిన పవన్ కల్యాణ్.. తిరుపతి, చిత్తూరు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని జనసైనికులతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సూచనలు చేశారు జనసేనాని. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారని అయినా వెనకబాటుతనం మాత్రం పోలేదన్నారు. నేతలకు పచ్చటి పొలాలు ఉన్నాయని.. పేదలు మాత్రం పొట్టచేత పట్టుకుని వలస పోతున్నారని ఆరోపించారు. ఓట్ల రాజకీయాలను. జనసేన కేడర్‌ని, రైతుల్ని ఇబ్బంది పెట్టడం మానుకున్నపుడే జగన్‌ను గౌరవిస్తానన్నారు తన మతం.. కులంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. మతం మారిన తర్వాత కులం ప్రస్తావన ఎందుకొచ్చిందంటూ ప్రశ్నించారాయన.

దిశ వంటి ఘనటలు ఆగాలంటే..సింగపూర్ తరహా చట్టాలు అవసరం అన్నారు పవన్. ఆడ బిడ్డల మానప్రాణాలను సంరక్షించుకోకపోతే నేతలెందుకు అంటూ నిలదీశారు.. అంతకుముందు..తెలుగుభాష పరిరక్షణపై భాషాకోవిదులు, సాహితీవేత్తలతో ఇష్టాగోష్టి నిర్వహించారు పవన్. ఓట్ల కోసం కాకుండా సంస్కృతి, భాష కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలన్నారు. తెలుగు హీరోల్లో చాలామందికి తెలుగు రాయడం, చదవడం రాదన్నారు.

పవన్ తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం. కార్యకర్తలు కోరినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు నాలుగేళ్లకు పైగా సమయం ఉండటంతో పవన్ దీనిపై ఇప్పుడే స్పందిచే అవకాశం లేదంటున్నారు.

TV5 News

Next Post

మెక్సికోలో భారీ ఎన్ కౌంటర్

Mon Dec 2 , 2019
మెక్సికోలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు, మాదకద్రవ్యాల ముఠాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది మరణించారు. వీరిలో 13మంది ముఠా సభ్యులు కాగా… ఇద్దరు సాధారణ పౌరులు, నలుగురు పోలీసులు ఉన్నారు. అమెరికా సరిహద్దుకు 40 మైళ్లదూరంలో విల్లాయూనియన్ పట్టణంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఓ భవనంలో డ్రగ్స్ స్మగ్లర్లు దాగినట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికిచేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఇరువర్గాల […]