రసాభాసగా మారిన రైతు భరోసా కార్యక్రమం

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని శివకోటి గ్రామంలో రైతు భరోసా కార్యక్రమం రసాభాసగా మారింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ రాకుండానే వైసీపీ కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభించారు. అయితే కాసేపటికే సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే రాపాక.. అధికారులు, వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్‌ పాటించకపోవడంపై నిలదీశారు. ఈ క్రమంలో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. వ్యవసాయ అధికారులు తనను పిలిచి అవమానించారని మండిపడ్డ రాపాక.. అధికారుల తీరుకు నిరసనగా సభ నుండి వెళ్లిపోయారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

TV5 News

Next Post

కేంద్రం కార్యాచరణతో ఏపీకి తొలి షాక్‌ !

Tue Oct 15 , 2019
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కేంద్రం యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసింది. పెట్టుబడిదారులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, అన్ని అగ్రిమెంట్లకు కట్టుబడి ఉంటామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సూటిగా చెప్పారు. విద్యుత్ ఒప్పందాలకు మాదీ భరోసా అన్నారామె. కేంద్రం కార్యాచరణతో ఏపీకి తొలి షాక్‌ తగిలేలా ఉంది. సౌర, పవన్‌ విద్యుత్‌ కంపెనీలకు LCలు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు రెండ్రోజుల డెడ్‌లైన్‌ విధించింది. ఆలోగా ఇవ్వకుంటే.. కేంద్ర పూల్‌ నుంచి విద్యుత్‌ […]