రికార్డు స్థాయిలో ‘సైరా’ డిజిటల్ రైట్స్ .. ఎంతో తెలుసా?

మెగాస్టార్ మెగా మూవీ సైరా హడావుడి స్టార్ట్ అవుతోంది. మరో ఇరవై రోజుల్లో సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ మూవీకి ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. కర్నూలులోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందంటున్నారు. దక్షిణాదిలో నాలుగు బాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ కాబోతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న విడుదలవుతోంది. అయితే ఈ సినిమాకి 250 కోట్లు ఖర్చు చేశారనే టాక్ వినిపిస్తోంది. హిస్టారికల్ మూవీ కావడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. లేటెస్ట్ గా సైరా డిజిటల్ రైట్స్ కి 40 కోట్లు దక్కాయట. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ బాషలకు గానూ అమెజాన్ ప్రైమ్ 40 కోట్లకు సైరా డిడిటల్ రైట్స్ దక్కించుకుంది. రామ్ చరణ్ ప్రస్తుతం ధియేట్రికల్ రైట్స్ బిజినెస్ ని క్లోజ్ చేయడంలో బిజీగా ఉన్నాడు. మరి ఇంత గ్రాండ్ గా వస్తున్న సైరాకి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

వాట్సప్‌లో భర్త మెసేజ్.. అది చూసి భార్య షాక్

Wed Sep 11 , 2019
చట్టాలు ఎన్ని వస్తున్నా తప్పు చేసేవారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తలాక్ సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని చట్టంగా మార్చింది. ట్రిపుల్ తలాక్ ఆచారంతో భార్యలను వదిలించుకునే పద్దతికి ఫుల్ స్టాప్ పెట్టింది. కానీ అది చట్టంగా మారినా సంస్కృతిలో ఎలాంటి మార్పు రాలేదు. దానికి తాజాగా జరిగిన ఓ సంఘటనే ఉదాహరణ. కేరళకు చెందిన ఓ ఎన్నారై తన భార్యకు వాట్సప్‌లో మూడు […]