అమ్మ, అమ్మమ్మ అందరూ కలిసి హ్యాపీగా చూసే చిత్రం .. ఓ బేబీ ట్విట్టర్ రివ్యూ

కొరియాలో హిట్టయిన ‘మిస్ గ్రానీ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింది నందినీ రెడ్డి. ఓ బేబీగా సమంత ఎమోషనల్‌ని, కామెడీని పండించి ఆధ్యంతం ఆకట్టుకుంది. మంచి కథాంశం ఉన్న చిత్రాలని ఎంపిక చేసుకుని మంచి మార్కులు కొట్టేస్తోంది సమంత. ఇప్పుడు ఓ బేబీ అంటూ సందడి చేస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నాగశౌర్య, లక్ష్మీ, రావురమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో సమంత 23 ఏళ్ల యువతిగా 70 ఏళ్ల బామ్మగా డిఫరెంట్ రోల్ ప్లే చేసి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది సమంత. దాంతో అభిమానులంతా ఓ బేబీ కోసం ఎదురు చూశారు. చిత్రాన్ని చూసిన నెటిజన్లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. సమంత తన కెరియర్‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని..
క్లైమాక్స్‌సీన్స్‌లో అద్భుతంగా నటించిందని అంటున్నారు. కొంతమంది అమ్మమ్మలతో కలిసి వెళ్లి చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారట. ఎంటర్‌టైన్ చేస్తూనే ఎమోషనల్‌ డ్రామాగా కథను మలిచిన తీరు అద్భుతంగా ఉందని అంటున్నారు ప్రేక్షకులు. సమంత కామెడీతో కడుపుబ్బా నవ్వించిందని అంటున్నారు నెటిజన్లు. మరికొన్ని ట్విట్టర్ రివ్యూలు..

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ట్రెండ్‌ను మార్చిన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్

Fri Jul 5 , 2019
సాధారణంగా బడ్జెట్ అనగానే.. బ్రీఫ్ కేస్ పట్టుకున్న ఆర్థిక మంత్రే గుర్తుకు వస్తారు. కానీ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ ట్రెండ్ ను మార్చారు. బ్రీఫ్ కేస్ స్థానంలో.. ఎరుపు రంగులో ఉన్న పార్శిల్ బ్యాగ్ తో కనిపించారామె. దానిపై మూడు సింహాల రాజముద్ర కూడా ఉంది. సంప్రదాయాన్ని పక్కనబెట్టి ఎర్రటి బ్యాగ్‌లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు నిర్మలా సీతారామన్‌. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి […]