నూతన వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యువకుడు

sand-gift

పెళ్లికి వెళ్తే ఏదో ఒక గిఫ్ట్‌ పట్టుకెళ్తాం. కొత్త జంట కాపురానికి అవసరమయ్యే వాటిల్లో మనకు నచ్చింది కానుకగా చదివిస్తాం. కానీ విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఓ పెళ్లిలో ఓ వ్యక్తి డబ్బాడు ఇసుకను గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని నీట్‌గా ప్యాకింగ్ మీద ప్యాకింగ్ చేసి మరీ తెచ్చాడు. తీరా దీన్ని ఓపెన్ చేశాక.. అవాక్కవడం, ఆపై నవ్వుకోవడం పెళ్లికొడుకు, పెళ్లికూతురు వంతయ్యింది. ఇసుకకు ప్రస్తుతం ఎంత కొరత ఉందో, ఎంత డిమాండ్ ఉందో చెప్పేందుకే ఇలా చేశానంటున్నాడు తలారివానిపాలెంకు చెందిన కాశీనాయుడు. ప్రత్యర్థులపై పంచ్‌కు ఇలా పెళ్లినే వేదిక చేసుకోవడాన్ని కొందరు తప్పుపట్టినా.. మరికొందరు మాత్రం ఈ తమాషా చూసి తెగ నవ్వుకున్నారు.

TV5 News

Next Post

నకిలీ వీసాతో దుబాయ్‌ వెళ్లేందుకు యత్నించిన మహిళ అరెస్ట్

Tue Nov 12 , 2019
నకిలీ వీసాతో దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళతో పాటు ఇందుకు కారకుడైన ఏజెంట్‌ను శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు చిత్తూరుజిల్లా పీలేరు వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీలేరుకు చెందిన జ్యోతి అనే మహిళ దుబాయ్‌ వెళ్లేందుకు అదే ప్రాంతానికి చెందిన ఏజెంట్‌ షేక్ అబ్దుల్ ఖాదర్‌ భాషాను సంప్రదించింది. ఏజెంట్‌ అడిగినంత ముట్టజెప్పింది. అయితే ఆమె నిరక్షరాస్యతను […]