భవన నిర్మాణ కార్మికుల నిరాహార దీక్ష భగ్నం

sand-issue
తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడలో భవన నిర్మాణ కార్మికుల నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కార్మికులను అరెస్ట్‌ చేసి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం  రూ. 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద దీక్ష చేపట్టారు. ఇసుక కోరతతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక కుటుంబ పోషణ భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేని వారికి రూ.10వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

TV5 News

Next Post

ఇంటర్, డిగ్రీ అర్హతతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు..

Sat Nov 16 , 2019
ఫ్యాషన్ రంగంపై అభిరుచి, ఆసక్తి ఉన్న విద్యార్థులు సృజనాత్మకతను నిరూపించుకోవాలనుకునేవారు ఫ్యాషన్ డిజైనింగ్/ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల ద్వారా తమ కెరీర్‌ను మలుచుకోవచ్చు. డిప్లొమా, డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియెట్ అర్హత. డిప్లొమా కాలవ్యవధి ఏడాది. డిగ్రీ మూడు నుంచి నాలుగేళ్లు. పీజీ రెండు సంవత్సరాలు. చాలా కోర్సులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని కోర్సులు చేయాలంటే మాత్రం సంబంధిత విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. మరికొన్ని […]