తను లేడన్న వార్తతో నా గుండె పగిలింది

బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ కూతురు త్రిషాల దత్‌ ప్రియుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని త్రిషాల సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. అతనితో ఉన్న జ్ఞాపకాలు త్రిషాల నేమరువేసుకుంది. “అతని మరణ వార్త వినగానే నా గుండె పగిలింది. నీతో ఉన్న ప్రతిక్షణం ఆనందగానే గడిచిపోయింది. నా పట్ల శ్రద్ధ వహించినందుకు కృతఙ్ఞతలు. నా జీవితంలో నేనేప్పుడు పొందనంత సంతోషాన్ని నాకు నువ్వు ఇచ్చావు. నీ ప్రేమను పొందినందకు అదృష్టవంతురాలుగా భావిస్తున్నా. భౌతికంగా నిష్క్రమించిన నాలో మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటావు. ఐ లవ్‌ యూ. మిస్ యు .. నీపై నాకు ప్రతిరోజు ప్రేమ పెరుగుతూనే ఉంటుంది”. అంటూ త్రిషాల భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు.

అతడు ఎప్పుడు చనిపోయాడనేది స్పష్టంగా తెలియనప్పటికీ ఆమె పోస్టును బట్టి అతడు మంగళవారం చనిపోయినట్లుగా తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే త్రిషాల.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోలకు ఎక్కువగా పోస్ట్ చేసేది. అతను ఇటాలియన్ చెందిన వ్యక్తి. అతడి మరణంతో త్రిషాల శోకసంద్రంలో మునిగిపోవడంతో అభిమానులు ఆమెను ఓదారుస్తున్నారు. ” ఆ విషాదం నుంచి బయటవచ్చి నువ్వు మరింత ధైర్యంగా పోరాడాల్సి ఉంటుందని” అంటూ కామెంట్ చేస్తూ ఆమెపై సానుభూతి చూపిస్తున్నారు. త్రిషాల దత్‌.. సంజయ్‌ మొదటి భార్య రిచా శర్మ కూతురు. సంజయ్‌ మెుదటి భార్యతో ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడంతో త్రిషాలతో అతనికి ఎక్కువగా అనుబంధం లేదు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

గుడ్‌న్యూస్.. ఇకపై మీ భాషలోనే బ్యాంకు పరీక్ష..

Thu Jul 4 , 2019
ఇంగ్లీష్ రాదు.. హిందీ అర్థం కాదు.. బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేద్దామంటే పరీక్షా పత్రం హిందీ, ఇంగ్లీషుల్లో ఉంటుందని చింతించాల్సిన అవసరం లేదు. ఇకపై బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. బ్యాంకు పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే బ్యాంకు పరీక్షలు రాసే అవకాశం ఉంది. దీని […]