‘దీపావళి’కి ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్లు ఉచితంగా..

ఇటీవల ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. మరోసారి బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది. రాబోయే దీపావళి సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ‘ఎస్‌బీఐ ఇండియా కా దీపావళి ఆఫర్’ పేరుతో పండగ ఆఫర్లను ప్రకటించింది. అంతేకాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ సేల్ లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఎస్‌బీఐ పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఆఫర్ 30 అక్టోబర్ 2019 వరకు ఉంటుందని వెల్లడించింది.

ఇందులో ముఖ్యంగా రూ.లక్ష విలువైన మేక్ మై ట్రిప్ యాప్ హాలిడే వోచర్‌ను గెలుచుకోవచ్చని.. అయితే ఈ అద్భుత అవకాశం ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై ఎక్కువ మొత్తం షాపింగ్ చేసిన వినియోగదారులకు మాత్రమే దక్కనుంది. అంతేకాదు సరికొత్త షావోమి స్మార్ట్‌ఫోన్లను ఉచితంగా అందిస్తుంది. ఇంకా మెగా ప్రైజ్, వీక్లి ప్రైజ్, డైలీ ప్రైజ్, అవర్లీ ప్రైజ్‌లు కూడా ఈ ఆఫర్లో గెలుచుకోవచ్చని స్పష్టం చేసింది.

ఆఫర్లు ఇవే..
అవర్లీ ప్రైజ్ కింద రూ.1000 విలువ చేసే ప్యూమా గిఫ్ట్ వోచర్
డైలీ ప్రైజ్ కేటగిరీలో రూ.7000 వైర్‌లెస్ హెడ్ ఫోన్స్
వీక్లీ కేటగిరీలో రూ. 17,499ల ఎంఐ ఏ3 ఫోన్

TV5 News

Next Post

కూతుళ్ల కాళ్లు కడిగి.. వారి ఆశీర్వాదం తీసుకున్న గౌతమ్ గంభీర్

Wed Oct 9 , 2019
మాములుగా పెళ్లి సమయంలో తండ్రి తన కూతరు కాళ్ళు కడుగుతాడు.. అయితే టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మాత్రం తన చిన్నారి కూతుళ్ళ  కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశాడనే డౌట్ రావొచ్చు.. ఇదంతా శరన్నవరాత్సోవాల సందర్భంగా జరుపుకునే అష్టమి కంజక్‌ ఆచారంలో భాగం. ఈ ఆచారం ప్రకారం పెళ్ళైనా.. కాకపోయినా.. దసరా సమయంలో తండ్రి తన కూతుళ్ళ కాళ్ళు కడిగి ఆ […]