పల్లవి.. చైతూ కాంబినేషన్.. శేఖర్ కమ్ముల డైరెక్షన్

నాగ చైతన్య.. సాయి పల్లవితో మరో అద్భుతమైన ప్రేమకావ్యాన్ని సృష్టిస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. శేఖర్ సినిమా ఓ అపురూప ఆణిముత్యం. పచ్చని పంట పొలాల్లో పారుతున్న సెలయేరులా ఉంటుంది ఆయన చిత్రం. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. విలేజ్ నుండి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అని అనుకునే ఇద్దరి మధ్య ప్రేమ కథ ఇది. ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ లవ్ స్టొరీ లో నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్నారు. తెలంగాణ యాసని నాగ చైతన్య బాగా ఇష్టపడి నేర్చుకున్నాడు. రెహ్మాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.  ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ మూవీ కి నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మాతలు.

 

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కేసీఆర్ మాట తప్పారు.. నాయిని సంచలన వ్యాఖ్యలు

Mon Sep 9 , 2019
మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పానని, అయితే కౌన్సిల్‌లో ఉండు.. మంత్రి పదవి ఇస్తా అని కేసీఆరే అన్నారని నాయిని గుర్తుచేశారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. తనకు ఆర్టీసీ […]