హీరో శర్వానంద్‌‌కు శస్త్రచికిత్స.. 11 గంటలపాటు..

హైదరాబాద్‌లో హీరో శర్వానంద్‌‌కు శస్త్రచికిత్స పూర్తి అయింది. 11 గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స చేశారు సన్ షైన్ వైద్యులు. థాయిలాండ్ లో స్కైడైవింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు శర్వానంద్. భుజపుటెముకకు తీవ్ర గాయం కావడంతో సన్ షైన్ ఆస్పత్రిలో చేరారు. రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని శర్వానంద్ కు వైద్యులు సూచించారు. శర్వానంద్ గాయం కారణంగా రణరంగం, 96 రిమేక్ చిత్రాలకు అంతరాయం కలిగింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

బీజేపీ జాతీయాధ్యక్షునిగా అమిత్ షా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..

Mon Jun 17 , 2019
భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సీనియర్ నేత జేపీ నడ్డా నియమితులయ్యారు. 8 నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షునిగా అమిత్ షానే కొనసాగనున్నారు. ఇక కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన నడ్డాకు బీజేపీ నాయకత్వం అభినందనలు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాతో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, నడ్డాను అభినందించారు.