ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌

latha-mangeshkar

భారతీయ ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ (90) స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. కొంతకాలంగా ఆమె ఆయాసంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో సోమవారం తెల్లవారుఝామున లతాజీని ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సీనియర్ వైద్య సలహాదారు డాక్టర్ ఫరోఖ్ ఇ ఉద్వాడియా పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థతితి నిలకడగానే ఉందని.. ఆమె కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.

TV5 News

Next Post

టీఆర్‌ఎస్ నేతల ఇళ్లను ముట్టడి చేసిన ఆర్టీసీ కార్మికులు

Mon Nov 11 , 2019
ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన లాఠీఛార్జ్‌కు నిరసనగా ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల వద్ద ఆందోళన చేపట్టారు. పలుచోట్ల పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది. 38రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. డిమాండ్ల సాధనతోపాటు.. ట్యాంక్‌బండ్‌పై జరిగిన లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు ముమ్మరం చేశారు. ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్ డిపోలకు […]