ఆరేళ్ల పిల్లాడు.. ఆగకుండా పుషప్స్.. వీడియో వైరల్

ఏదో ఒకటి చెయ్యాలి. రికార్డులు బద్దలు కొట్టాలి. అందుకు వయసుతో నిమిత్తం లేదనుకుంటే ఎలా. గెలుపు, ఓటముల గురించి తెలియని వయసు. ఆడుకోవడం, అమ్మ చెప్పింది వినడం, పెట్టింది తినడం చేసే వయసే కానీ.. కుదురుగా కూర్చుని బుద్దిగా చెప్పింది వినే వయసు కాదు. అయినా ఆరేళ్ల పిల్లాడు అన్ని పుషప్స్ ఎలా చేశాడో కానీ. ఎంత ట్రైనింగ్ తీసుకుంటే మాత్రం.. పాపం పసిబిడ్డ అని అనిపించకమానదు వీడియో చూసే వారికి.. రష్యాకు చెందిన ఆరేళ్ల ఇబ్రహీం ల్యానవ్ రెండు గంటల్లో 3,270 పుషప్స్ చేసి రికార్డు సృష్టించాడు. ఇటీవల చింగిస్ అనే స్పోర్ట్స్ క్లబ్ ఈ పోటీలను నిర్వహించింది. క్లబ్‌కి తండ్రి రోజూ వెళుతుండేవాడు. చిన్నారి ఇబ్రహీం కూడా తండ్రితో పాటు వెళ్లి పుషప్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. కొడుకును విజేతగా చూడాలని తండ్రి కూడా సహకారం అందించాడు. దీంతో ఇబ్రహీం ఈ రికార్డుని నెలకొల్పాడు. మధ్యలో కష్టమనిపించినా ఆగకుండా చేస్తూనే ఉన్నాడు. పోటీలో గెలవడం కోసం ఆగకుండా 4,445 పుషప్స్ చేశాడు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

గన్, లిక్కర్ బాటిల్‌తో ఐటెం సాంగ్స్‌కు చిందులేసిన ఎమ్మెల్యే..

Wed Jul 10 , 2019
ఓ చేతిలో గన్.. మరో చేతిలో లిక్కర్ బాటిల్.. అనుచరులతో కలసి బాలీవుడ్ పాటలకు చిందులు.. ఓ ప్రజాప్రతినిధి యవ్వారం ఇది. సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ సీన్ ఉత్తరాఖండ్‌లో కనిపించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ ఎమ్మెల్యే, తాను ప్రజాప్రతినిధిని అన్న విషయం కూడా మరిచిపో యి యథేచ్చగా జల్సా చేశాడు. గన్, లిక్కర్ బాటిల్‌తో రౌడీలా బిహేవ్ చేశాడు. ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్‌సింగ్ చాంపియన్‌ నిర్వాకం […]