సొంతింటి కలను ఇప్పుడు సొంతం చేసుకోవడమే మంచిది.. ఎందుకంటే..

ఇళ్ళు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే మధ్యతరగతికి సొంతిల్లు ఉండాలనేది ఓ కలగానే మిగిలిపోతుంది. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణే భారంగా మారిన తరుణంలో ఇల్లు కొనాలన్నది భవిష్యత్ ఆలోచనగానే మారింది. అయితే కొన్నిసలహాలు పాటిస్తే లగ్జరీ ప్లాట్ కాకపోయినా సాధరణ ఇల్లునైనా సొంతం చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దానికి ముందుగా మార్కెట్‌ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.

కొన్ని బడా నిర్మాణ సంస్థలు నగరంలోకి విల్లా కల్చర్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. దీంతో సామాన్యులకు తక్కువ ధరలో లభించే ఇళ్లు అందుబాటులో లేకుండా పోయాయి.చిన్న వెంచర్లను నిర్మించే డెవలపర్లు కూడా తప్పనిసరి పరిస్థితిల్లో ధరలను పెంచేశారు. దీంతో నగరంలో గత కొంతకాలంగా రేట్లు పెరిగిపోయాయి. భవిష్యత్‌లో మరింత పెరిగే
అవకాశముంది. అందువల్ల మీ సొంతింటిని ఎంపిక చేయడంలో ఆలస్యం చేయకపోవడమే మంచిది.

ఇళ్లు కొనాలనే వారు ఇదే సరైన సమయమని భావించాలి. తాజా కేంద్ర బడ్జెట్, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల వలన ఇళ్ళ ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది.అలాగే ఆకాశాన్నంటిన నిర్మాణ సామగ్రి ధరలు స్వల్పంగా తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గృహ రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గాయి. ఇన్ని సానుకూల అంశాలు ఉన్న కారణంగా ఇప్పుడే సొంతింటి కలను నిజం చేసుకోవడం మంచిది. వడ్డిరేట్లు తగ్గిన కారణంగా చాలా మంది ఎగువతరగతి వారు కూడా ఇళ్ళ కొనుగోళ్ళుకు
ప్రయత్నిస్తారు. ఈ కారణంగా పెట్టుబడులు పెట్టేవారు ఈ రంగంలోకి అడుగుపెట్టి కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తారు. కాబట్టి ఎంత అలస్యం అయితే అంతగా రేట్లు పెరుగుతాయ. అందుకే గృహ కొనుగోలు నిర్ణయానికి ఇదే సరైన సమయం.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

విశాఖ టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు

Sun Jun 30 , 2019
విశాఖ టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు. లింక్‌ డాక్యుమెంట్స్ ఇవ్వకుంటే కూల్చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల్లో డాక్యుమెంట్స్‌ సమర్పించాలని నగర్‌ టీడీపీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు. ఇప్పటికే కృష్ణ కరకట్టపై ప్రజావేదిక అక్రమమంటూ కూల్చడంతో పాటు టీడీపీ అధినేత ఉన్న ఇంటికి నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఈనేపథ్యంలో విశాఖలో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టింది.