వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా జట్టు ఖరారు.. టీంలోకి కొత్త ఆటగాళ్ళు

వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా జట్టు ఖరారు.. టీంలోకి కొత్త ఆటగాళ్ళు

వరల్డ్‌ కప్‌ ఓటమి నేపథ్యంలో.. భారత జట్టు ఎంపికలో భారత సెలక్టర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యువకులకు జట్టులో చోటిచ్చారు. వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఆగస్టు 3న ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ మూడు ఫార్మాట్లకు కోహ్లీ కెప్టెన్‌గా, వన్డే, టీ20లకు వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌, టెస్టు వైస్‌ కెప్టెన్‌గా రెహానెను ఎంపిక చేశారు. ఈ టూరుకు అందుబాటులో ఉండనని ధోనీ ముందే చెప్పడంతో.. మూడు ఫార్మాట్లకు రిషబ్‌ పంత్‌ను కీపర్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు..

వరల్డ్‌కప్‌ ఆడుతుండగా గాయాల కారణంగా జట్టుకు దూరమైన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ టీ 20, వన్డే జట్లలో చోటు దక్కించుకున్నారు. మరోవైపు అంబటి రాయుడు ఎంపికతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సెలక్టర్లు ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి హనుమ విహారీకి టెస్టు జట్టులో చోటు కల్పించారు. వరల్డ్‌ కప్‌లో బంతితో నిప్పులు చెరిగిన భూమ్రాకు వన్డేల నుంచి రెస్ట్‌ ఇచ్చారు..

టీ20లకు .. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ, వైఎస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌, కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనీలను ఎంపిక చేశారు.

వన్డే కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ, వైఎస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవ్‌దీప్‌ సైనీలను ఎంపిక చేశారు.

టెస్టు జట్టుకు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌గా అజింక్య రహానె మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, పుజారా, హనుమ విహారి, రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహా, అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌లు చోటు దక్కించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story